![]() |
![]() |
.webp)
ఫామిలీ స్టార్స్ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో సుడిగాలి సుధీర్ హంగామా మాములుగా లేదు. ఈ షోకి శశిమధనం మూవీ టీం అలాగే వసంత కోకిల సీరియల్ టీమ్ వాళ్ళు వచ్చారు. ఇక ఈ షోలో సుధీర్ బావ కోసం కొట్టుకునే మరదళ్ళు భానుశ్రీ, స్రవంతి చొక్కారపు ఇద్దరూ జోష్ తో కలిసొచ్చి గేమ్స్ ఆడించారు. ఇక శశిమధనం మూవీ హీరోయిన్ సోనియాని పిలిచి తన గురించి మంచివి మూడు విషయాలు చెప్పమని సుధీర్ అడిగాడు.
దాంతో మూవీ హీరో ఒకటి, రెండు, మూడు ఐపోయాయి అనేసరికి సుధీర్ నవ్వేసాడు. మూవీ హీరో మధు, సీరియల్ హీరో రవిశంకర్ రాథోడ్ ఇద్దరూ సుధీర్ ని ఒక రేంజ్ లో ఆడేసుకున్నారు. దాంతో ఈ రెండు టీములు తేడాగా ఉన్నాయి అన్నాడు. దానికి సోనియా కౌంటర్ ఇచ్చింది. తేడాగా ఉంటే తేడాగానే కనిపిస్తాయి అని చెప్పింది. ఇక మూవీ హీరో హీరోయిన్ మధు, సోనియా ఇద్దరూ కలిసి ఉప్పెన మూవీలోని రొమాంటిక్ సాంగ్ కి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఎంటర్టైన్ చేశారు. ఇక సుధీర్ ఐతే "మై ఆల్ టైం ఫెవరేట్ శృంగార రస" అంటూ అందరినీ నవ్వించాడు. ఇక రవిశంకర్ రాథోడ్ వచ్చి "ఆవాహయామి" అని సుధీర్ ని అనేసరికి కొంచెం చిరాగ్గా పెట్టాడు ఫేస్...అదే అమ్మాయిలూ ఆవాహయామి అంటే బాగుంటుందా అన్నాడు రావిక్రిష్ణ రాథోడ్ అనేసరికి ఈసారి నేను ట్రై చేస్తూ అంటూ కామెడీ చేసాడు సుధీర్.
![]() |
![]() |